Salaar: ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సలార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా?

ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాలలో అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుని మరో 58 రోజుల్లో థియేటర్లలో సలార్ రిలీజ్ కానుంది. ఆగష్టు నెలలో సలార్ ట్రైలర్ రిలీజ్ కానుండగా ఈసారి ఫ్యాన్స్ ను ఏ మాత్రం నిరాశపరచకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సలార్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉండనుందని సమాచారం అందుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలలో మదర్ సెంటిమెంట్ అద్భుతంగా పండగా సలార్ సినిమా మాత్రం ఫ్రెండ్ షిప్ ప్రధానంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

సలార్ సినిమాలో స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం పోరాటం చేసే వ్యక్తి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని తెలుస్తోంది. సలార్ మూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు 800 కోట్ల రూపాయల నుంచి 900 కోట్ల రూపాయల రేంజ్ లో జరిగిందని భోగట్టా. సలార్ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుండగా సలార్2 రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

సలార్3 (Salaar) కూడా ఉండబోతుందా అని కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తుండగా ఆ ప్రశ్నలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సలార్2 సినిమా సలార్1ను మించి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ లుక్స్ సైతం ఈ సినిమాలో అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుందని వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని భోగట్టా. సలార్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus