Salman Khan, Samantha: సల్మాన్ నోట ‘ఊ అంటావా మావ’ పాట!

ఈ మధ్యకాలంలో సౌత్ లో వచ్చిన చాలా పాటలు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను రాబడుతున్నాయి. ‘బుట్టబొమ్మ’, ‘సామజవరగమనా’, ‘రౌడీ బేబీ’ లాంటి పాటలు నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా అయితే ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా ఊఊ అంటావా మావా’ సాంగ్ బాగా వైరల్ అయింది. మొదట విన్నప్పుడు ఈ పాట జనాలకు పెద్దగా ఎక్కలేదు కానీ ఆ తరువాత రీచ్ ఓ రేంజ్ లో పెరిగింది.

అన్ని వర్గాల ఆడియన్స్ ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హిందీలో ‘పుష్ప’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ పాట రీచ్ మరింత పెరిగింది. నార్త్ లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఈ పాట బాగా కనెక్ట్ అయింది. చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ‘ఊ అంటావా’ మాయలో పడిపోయారు. తాజాగా ఓ అవార్డు వేడుక సందర్భంగా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సాంగ్ ఏది అని అడగ్గా.. మరో ఆలోచన లేకుండా ‘ఊ అంటావా’ అని హమ్ చేశారు సల్మాన్.

ఓ తెలుగు పాట బాలీవుడ్ సూపర్ స్టార్ నోటి నుంచి వినిపించడం.. ఈ పాట తన ఫేవరెట్ అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టి ఈ పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్ధమవుతోంది. సల్మాన్ తన పాటను హమ్ చేయడంతో సమంత కూడా ఎగ్జైట్ అయింది. ట్విట్టర్ లో వైరల్ అవుతోన్న సల్మాన్ వీడియోకి లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. ‘పుష్ప2’లో కూడా ఇలాంటి పాట పడితే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus