బాలీవుడ్ సూపర్ స్టార్, హిందీ బిగ్ బాస్ హోస్ట్ అయిన సల్మాన్ ఖాన్ సాధారణంగా ప్రేక్షకులను తన హాస్యం, స్టైలిష్, స్పాంటేనియస్ రియాక్షన్స్‌తో అలరిస్తుంటాడు. ఎంత టెన్షన్ సిట్యుయేషన్ వచ్చినా కూల్‌గా హ్యాండిల్ చేసే సల్మాన్ భాయ్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం చాలా అరుదు. అయితే ఈసారి బిగ్ బాస్ వేదికపై సల్మాన్ తన కన్నీళ్లతో ప్రేక్షకులను షాక్‌కి గురిచేసాడు.
హిందీ బిగ్ బాస్–19 తాజాగా ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా, షోలో ఎన్నో ఎమోషనల్ మోమెంట్స్ చోటుచేసుకున్నాయి. అందులో ముఖ్యంగా నిలిచిపోయేది దివంగత బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర గారికి అర్పించిన స్పెషల్ ట్రిబ్యూట్. ధర్మేంద్ర గతంలో బిగ్ బాస్‌కు గెస్ట్‌గా హాజరైన ఎపిసోడ్ క్లిప్స్‌ను టీమ్ మళ్లీ ప్రదర్శించింది. ఆ వీడియో స్టార్ట్ అయిన క్షణం నుంచే వేదికపై వాతావరణం మారిపోయింది.
ఆ దృశ్యాలను చూసిన సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా కంటతడి పెట్టాడు. భావోద్వేగ గొంతుతో “మనం నిజమైన హీమ్యాన్‌ను కోల్పోయాం… నేను చూసిన గొప్ప మనుషుల్లో ధర్మేంద్ర గారు ముందుంటారు. ఆయనలాంటి నటుడు తిరిగి దొరకరు. నా తండ్రి పుట్టినరోజు నాడే ఆయన మృతి చెందడం నా హృదయాన్ని ఇంకా బాదిస్తోంది. మిస్ యూ ధర్మేంద్ర జీ…” అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సాధారణంగా కఠినంగా కనిపించే సల్మాన్, ఇంత పర్సనల్ ఎమోషన్ బయటపెట్టడం అభిమానుల్ని కదిలించింది. ధర్మేంద్ర–సల్మాన్ బంధం ఎంత స్వచ్ఛమైనదో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.