తెలుగు సినిమాల్ని, పాత తమిళ సినిమాల్ని సమపాళ్లలో మిక్స్ చేసి సినిమాలు చేసి భారీ విజయాలు అందుకుంటున్న దర్శకుడు అట్లీ (Atlee Kumar). తమిళం – తెలుగులో విజయ్‌కి (Vijay Thalapathy) భారీ విజయాల్ని అందించిన అట్లీ.. బాలీవుడ్‌కి వెళ్లి షారుఖ్ ఖాన్‌తో (Shah Rukh Khan) ‘జవాన్’ (Jawan) అనే సినిమా చేసి రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నారు. ఆ వెంటనే సల్మాన్ ఖాన్‌తో (Salman Khan) సినిమా చేస్తున్నారు అని వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత సప్పుడు లేకపోవడంతో డౌట్స్ మొదలయ్యాయి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
నిజానికి ‘జవాన్’ సినిమాకు ముందే అట్లీ – అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో సినిమా మొదలవ్వాల్సింది. ‘పుష్ప’ (Pushpa) సినిమాల వల్ల అట్లీ సినిమాను బన్నీ పక్కన పెట్టాడు. ఇక్కడ సినిమాను అనే కంటే ప్రాజెక్ట్‌నే అనాలి. ఎందుకంటే అప్పటికి కథ ఓకే అవ్వలేదు. ఇద్దరూ కలసి పని చేస్తాం అని అనుకున్నారంతే. అయితే ఇప్పుడు ‘పుష్ప’, ‘జవాన్’ అయిపోవడంతో ఇద్దరూ కలసి సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఈ లోపు సల్మాన్ మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు నేను లేను అని క్లారిటీ ఇచ్చాడు.
‘సికందర్’ (Sikandar) సినిమా ప్రచారంలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అట్లీతో సినిమా గురించి ఈ క్రమంలో ప్రశ్న వచ్చింది. దాంతో సల్మాన్ ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది అని నేను అనుకోవడం లేదు. దీని పనులు ప్రారంభించినప్పుడు ఎలాగైనా పూర్తిచేయాలి అనుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటాలి అని ప్రయత్నించాం. కానీ, ముందుకుసాగడం లేదు. కారణం నాకూ తెలియదు. బహుశా బడ్జెట్ కారణమై ఉండొచ్చు. అందుకే వాయిదా పడుతుంది అని చెప్పాడు సల్మాన్.
అయినా, బాలీవుడ్ సూపర్ స్టార్ ఒకవైపు, వరుస విజయాలు అందులో భారీ విజయాలు ఇచ్చిన అట్లీ మరోవైపు. ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తా అంటే బడ్జెట్ విషయంలో లెక్కలేసే నిర్మాతలు ఉంటారా? టాలీవుడ్ నుండి అయినా వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టేస్తారు. మరెందుకో ఇప్పుడు ఇలా అన్నాడు సల్మాన్.