Ram Charan: రామ్‌ చరణ్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

రామ్‌ చరణ్‌  (Ram Charan) గురించి మీకు ఈ విషయాలు తెలుసా? అంటూ మీరు చాలా రకాల వీడియోలు చూసి ఉంటారు, వార్తలు చదివి ఉంటారు. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. అయితే ఇందులో మీరు చదివే విషయాలు కొన్ని ఇప్పటివరకు మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ తెలిసి ఉంటే మీరు రామ్‌చరణ్‌కు వీరాభిమాని అని చెప్పొచ్చు. మరి ఓసారి చరణ్‌ గురించి ఆసక్తికర విషయాలు చూస్తారా? మెగా పవర్‌ స్టార్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR Movie) సినిమాతో వచ్చి.. గ్లోబల్‌స్టార్‌గా మారాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఆయన క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.

Ram Charan

దానికి కారణం ఆయన నటన విషయంలో, లుక్స్‌ విషయంలో ఆ లెవల్‌లో తన అథారిటీ చూపిస్తాడు. రామ్‌చరణ్‌ను అందరూ చరణ్‌ అని పిలుస్తుంటారు. అయితే ఆయనకు రామ్‌ అని పిలిస్తేనే నచ్చుతుందట. తన ఫ్రెండ్‌, మరో స్టార్‌ హీరో తారక్‌లాగే (Jr NTR).. చరణ్‌కు కూడా వాచ్‌లు అంటే ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు గుర్తుగా వాచ్‌ని కొనుక్కుంటాడట. అంతేకాదు తన మొదటి పారితోషికంతో కూడా వాచీనే కొనుక్కున్నాడట. డ్యాన్స్‌ విషయంలో రామ్ చరణ్‌ శిక్షణ తీసుకోలేదట. అయినా మెగా స్టార్‌ ఫ్యామిలీ నుండి వచ్చి డ్యాన్స్‌ శిక్షణ ఎందుకు చెప్పండి.

ఇక చరణ్‌కు సంగీతంలోనూ పట్టుంది. అలాగే పాటలు కూడా పాడతాడట. అయితే ఇప్పటివరకు సినిమాల్లో ఆ ప్రయత్నం చేయలేదు. చరణ్‌ ఓ స్టార్‌ హీరోకి డబ్బింగ్‌ చెప్పాడని తెలుసా? ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ అనే బాలీవుడ్‌ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) హీరోగా రూపొందిన ఆ సినిమాలో ఆయనకు తెలుగులో గొంతు ఇచ్చింది చరణే. ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో సల్మాన్‌ నటించినందుకు ఆ గౌరవంతో చెప్పాడు అనుకోవద్దు.

ఎందుకంటే అంతకంటే చాలా ఏళ్ల ముందే ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ సినిమా వచ్చింది. ఇక ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) కృతజ్ఞతతో ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాలోని ఓ పాటలో తళుక్కున మెరిశాడు. నానమ్మ అంజనాదేవిని చేతి చేపల పులుసు అంటే చరణ్‌కు చాలా ఇష్టం. ఇంటి ఫుడ్‌ అంటే ఎంత ఇష్టం అంటే.. షూటింగ్‌ ఇంటికి దగ్గరలో ఉంటే ఇంటికే వచ్చి భోజనం చేసి వెళతాడట. ఇంత చెప్పిన మన పెద్ది అలియాస్‌ రామ్‌చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోతే ఎలా.. ‘హ్యాపీ బర్త్‌ డే రామ్‌’..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus