Salman Khan: ‘దబాంగ్’ టు ‘భారత్’ .. రంజాన్ టైంలో రిలీజ్ అయిన సల్మాన్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్!

పండుగ టైంలో మరీ ముఖ్యంగా హాలిడేస్ ఎక్కువగా ఉన్న టైంలో స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. దీంతో తమ కెరీర్లో బెస్ట్ లేదా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదైనట్టు అవుతుంది. 50 శాతం బయ్యర్స్ కూడా రికవరీ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే స్టార్ హీరోలు పండుగ సీజన్లో తమ సినిమాలను రంగంలోకి దించాలని ప్లాన్ చేసుకుంటారు.

మన తెలుగు హీరోలు అయితే ఎక్కువగా సంక్రాంతి పండక్కి లేదా దసరా పండక్కి తమ సినిమాలను విడుదల చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఇంకా మనకు చాలా పండుగలు ఉన్నాయి కాబట్టి.. పర్వాలేదు. కానీ బాలీవుడ్ హీరోలు మాత్రం ఎక్కువగా ఈద్ కు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఈద్ పండక్కి సినిమాలను రిలీజ్ చేసుకుంటాడు.

ఈ సీజన్ అతనికి చాలా సెంటిమెంట్ తో కూడుకున్నది. ఈ టైంలో రిలీజ్ అయిన (Salman Khan) సల్మాన్ సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అంతేకాదు ప్రతి సినిమా కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈసారి ఈద్ కు కూడా తన ‘కిసీ క బాయ్.. కిసీ క జాన్’ వంటి బడా చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాకి సల్మానే నిర్మాత కూడా కావడం విశేషం. ఇదిలా ఉండగా..ఈద్ టైంలో రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ సినిమాలు మరియు వాటి ఫస్ట్ డే కలెక్షన్లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) దబాంగ్: రూ. 14.50 కోట్లు

2) బాడీ గార్డ్: రూ. 21.60 కోట్లు

3) ఏక్ ద టైగర్ : రూ. 32.93 కోట్లు

4) కిక్ మూవీ : రూ. 26.40 కోట్లు

5) భజరంగీ భాయిజాన్ : రూ. 27.25 కోట్లు

6) సుల్తాన్ : రూ.36.54 కోట్లు

7) ట్యూబ్ లైట్ : రూ. 21.15 కోట్లు

8) రేస్ 3 : రూ. 29.17 కోట్లు

9) భారత్ : రూ. 42.30 కోట్లు.. రాబట్టింది

10) కిసీ క భాయ్ కిసీ క జాన్ : ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus