ప్రభుదేవా తో కలిసి ‘మహర్షి’ చూడబోతున్న కండల వీరుడు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం మే 9న విడుదలయ్యింది. ఇది మహేష్ కు 25 వ చిత్రం కావడంతో భారీగా విడుదల చేసారు. అందులోనూ ఇప్పుడు మరే భాషల్లోనూ పెద్ద చిత్రాలు లేకపోవడంతో అందరి దృష్టి ఈ చిత్రం పైనే పడింది. కేవలం మహేష్ అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాదు కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రాన్ని చూడబోతున్నాడట.

ప్రస్తుతం ప్రభుదేవా డైరెక్షన్లో ‘దబాంగ్ 3’ చిత్రం చేస్తున్నాడు సల్మాన్. ఇక ముంబైలో ప్రభుదేవాతో కలిసి సల్మాన్ ఖాన్ ఈ ‘మహర్షి’ చిత్రం చూడబోతున్నాడట. ఒకవేళ ఈ చిత్రం తనకి నచ్చితే హిందీలో రీమేక్ చేయడానికి కూడా రెడీ అవుతున్నాడని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. గతంలో ప్రభుదేవా డైరెక్షన్లో సల్మాన్ నటించిన ‘వాంటెడ్’ చిత్రం కూడా మహేష్ ‘పోకిరి’ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో వరుస ప్లాపుల్లో ఉన్న సల్మాన్ కు ‘వాంటెడ్’ చిత్రంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు సల్మాన్. అంతేకాదు సల్మాన్ మార్కెట్ మరింత పెరిగింది. అందులోనూ ‘మహర్షి’ కంటెంట్ ఉన్న సినిమా అని ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరికీ అర్ధమవుతుంది. అందుకే సల్మాన్ ‘మహర్షి’ నచ్చితే వెంటనే రైట్స్ కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus