Radhe Movie: సల్మాన్ ఖాన్ మూవీ ఫైనల్ వెర్డిక్ట్..!

Advertisement

సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘రాధే’.దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రంజాన్ కానుకగా గత వారం ఓటిటిలో రిలీజ్ అయ్యింది. సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్ హీరో సినిమాని ఓటిటిలో రిలీజ్ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. అందుకే హిందీ రాక పోయినా చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని తెగ చూసేసారు. జీ ప్లెక్స్,జీ5 వంటి ఓటిటిలతో పాటు డీటీహెచ్‌ల ద్వారా కూడా పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.

అందుబాటులో ఉన్న ఓవర్సీస్ మార్కెట్ల‌లో థియేట‌ర్ల ద్వారానే ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. విడుదలయ్యి వారం కావస్తోంది.. మరి ఈ చిత్రం హిట్ అయినట్టా? ప్లాప్ అయినట్టా? అనే విషయం తెలీక చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు. టాక్ ను బట్టి చూస్తే.. ఈ చిత్రం ఎపిక్ డిజాస్టర్.ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి లో ఈ చిత్రానికి 1.7/10 రేటింగ్ మాత్రమే నమోదయ్యింది. కానీ మొదటి వీకెండ్ ఈ చిత్రాన్ని 45 లక్షల మంది పైనే చూశారట.

ఇక 5 రోజులకు గాను 1 కోటి మంది చూసినట్టు తెలుస్తుంది. రూ.249 టికెట్ రేటు పెట్టి విడుదల చేశారు కాబట్టి..’రాధే’ రూ.200 కోట్ల పైనే వసూళ్లు సాధించినట్టు లెక్క. అంతే కాకుండా వ్యూయర్ షిప్ ను అలాగే కొత్త సబ్స్క్రిప్షన్ల లెక్క చూసుకుంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. అవన్నీ కలుపుకుంటే రూ.250 కోట్ల పైనే ‘రాధే’ రాబట్టినట్టు స్పష్టమవుతుంది. కాబట్టి ఈ చిత్రం కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయినట్టే..!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus