Radhe: ఇంటర్నేషనల్ మార్కెట్ పై సల్మాన్ ఫోకస్!

దేశం మొత్తం కరోనాతో ఇబ్బంది పడుతుంటే.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం తన కొత్తం సినిమా ‘రాధే’ను రంజాన్ కానుకగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకేసారి థియేటర్లతో పాటు ‘జీ’ ఓటీటీ, కొన్ని డీటీహెచ్ ల ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పాక్షికంగానో, పూర్థిస్థాయిలోనో లాక్ డౌన్ విధించారు. అన్ని చోట్లా థియేటర్లు మూతపడే ఉన్నాయి. ఎక్కడా కూడా తెరిచే సిట్యుయేషన్ కనిపించడం లేదు.

ఇలాంటి సమయంలో ‘రాధే’ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయడమేంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిన్నటి నుండి తెలంగాణలో కూడా లాక్ డౌన్ విధించడంతో థియేటర్లన్నీ అఫీషియల్ గా మూతపడ్డాయి. అయితే ఇండియా వరకు చూసుకుంటే ఏదో పేరుకే ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతోంది. ఎక్కడా కూడా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఉండకపోవచ్చు. ఇండియన్ ఆడియన్స్ ఈ సినిమాను జీలో లేదా, డీటీహెచ్ ల ద్వారా పే పర్ వ్యూ పద్దతిలో చూసుకోవాలి. కానీ థియేట్రికల్ రిలీజ్ అని చెప్పడానికి ఓ కారణం ఉంది.

ఇదంతా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఫోకస్ తోనే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఉన్నన్ని కేసులు ఇతర దేశాల్లో లేవు. అమెరికా, యూకే, గల్ఫ్ కంట్రీస్ లో ఇండియన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అక్కడ థియేటర్లు కూడా బాగానే నడుస్తున్నాయి. చాలా కాలంగా థియేటర్లలో సరైన హిందీ సినిమా ఏది కూడా రిలీజ్ కాలేదు. ఇలాంటి సమయంలో సల్మాన్ సినిమాను ఇంటర్నేషనల్ మర్కెట్స్ లో రిలీజ్ చేస్తే భారీ ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే చిత్రబృందం తెలివిగా థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాకి వంద కోట్ల కలెక్షన్స్ వస్తాయని.. ఇండియాలో పే పర్ వ్యూ పద్దతిలో కూడా మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus