‘ఓ బేబీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది అక్కినేని వారి ఇంటి కోడలు సమంత. జులై 5 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అంటే కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలాయి కాబట్టి కుదిరినన్ని ఎక్కువ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన చిత్తాన్ని ప్రమోట్ చేస్తుంది. ‘ఈ చిత్రం తనకి బాగా స్పెషల్ అని.. దర్శకురాలు నందినీ రెడ్డి తనకి సోదరి లాంటిదని.. ఇక ఈ చిత్రంలో నటించిన రాజేంద్ర ప్రసాద్ నుండీ కామెడీ టైమింగ్ నేర్చుకున్నానని తెలిపింది. ఇక నాగ శౌర్య పాత్ర కూడా సినిమాలో చాలా కీలకమైనదని.. ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకు.. నాగ శౌర్య కు ధ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఇదే క్రమంలో తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపింది. ముఖ్యంగా తన భర్త నాగ చైతన్య పై ప్రశంసలు కురిపించింది. ‘చైతు ఓ మంచి భర్త .. అలాగే ఓ మంచి తండ్రి కూడా అవుతాడనే నమ్మకం నాకు ఉంది. ‘ఏ మాయచేసావే’ సినిమాకి.. ఇప్పటికీ తనలో ఫోకస్ బాగా పెరిగింది. బాధ్యత కూడా పెరిగింది’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.