నిజ జీవితంలో కూడా సమంత.. శ్రావణి లానే ఉందట..!

సమంత అరగంట సేపు ఏడ్చేసిందట.. అదేంటి సమంతకి అంత పెద్ద కష్టమేమొచ్చిందని కంగారు పడుతున్నారా..? సమంత అలా ఏడవడం వెనుక కష్టం లేదంట.. చాలా ఆనందం ఉందట. అవును తన భర్తతో కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం ఉగాదికి ఒక్కరోజు విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సమంత… ఇలా ఏడ్చినట్టు చెప్పుకొచ్చింది. సమంత మాట్లాడుతూ… ‘ఈ చిత్ర విజయం చైతన్యకు చాలా కీలకం. ఈ చిత్రం హిట్టవుతుందని నాకు ముందు నుండీ నమ్మకం ఉంది. నా టీం పైన కూడా చాలా నమ్మకం ఉంది. కానీ రిలీజ్ కి ముందు రోజు చాలా భయమేసింది.

నాకు రెండున్నరకే మెలకువ వచ్చేసింది. ఈ సినిమా హిట్టవ్వాలని ప్రేయర్ చేస్తూ.. అలాగే హాల్ లో అటూ.. ఇటూ తిరుగుతూ ఉన్నాను. యూ.ఎస్ లో మొదటి షో పడి టాక్ ఎలా వస్తుందా అని టెన్షన్. నిర్మాత సాహు గారు ఫోన్ చేసి సినిమా బాగుంది అని చెప్పారు. అంతే.. ఇక అరగంట ఏడ్చేసాను. ఒకవేళ ఈ చిత్రం ప్లాప్ అయితే చైతన్య కి ఏం సమాధానం చెప్పాలా అని భయం వేసింది. దేవుడి దయ వలన సినిమా హిట్టయ్యింది. చిత్ర యూనిట్ అందరికీ నా స్పెషల్ ధ్యాంక్స్ ‘ అంటూ చెప్పుకొచ్చింది. సమంత ఇలా ఏడవడానికి అసలు కారణం నాగచైతన్య ప్లాపుల్లో ఉండటమే అని చెప్పకనే చెప్పింది. సమంత ‘రంగస్థలం’ ‘అభిమన్యుడు’ ‘సూపర్ డీలక్స్’ వంటి సూపర్ హిట్ చిత్రాలున్నాయి. కానీ తన భర్త చివరి మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో చైతన్య కచ్చితంగా హిట్టు కొట్టాలని తెర పరితపించింది సమంత. ‘మజిలీ’ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరూ శ్రావణి(సమంత) లాంటి భార్య కావాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఆ సినిమాలో తన భర్త పూర్ణ( నాగ చైతన్య) పై చూపించే ప్రేమ అలా ఉంటుంది. ఇక నిజ జీవితంలో కూడా సమంత తన భర్త చైతన్య పై అంతే ప్రేమ చూపిస్తుండడంతో.. నెటిజెన్లు సమంత పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus