సమంత మళ్ళీ బిజీ అయిపోయిందిగా..!

సమంత కెరీర్ మొదలెట్టి ఆరేళ్ళు అయ్యింది. తొలి సినిమానే మంచి విజయం సాధించడంతో ఈమెకి తర్వాత భారీ అవకాశాలే చుట్టుముట్టాయి. దాంతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా అవతరించిన సామ్ ఏడాదికి సగటున మూడు సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ ఏడాదిలోనే తమిళ తెలుగు భాషల్లో ఆరు సినిమాల్లో నటించింది (బెంగళూర్ నాటక్కల్ సినిమాలో అతిథి పాత్ర కలుపుకుని) ఆక్కినేని వారింట కోడలిగా అడుగెట్టనున్న ఈ అందాల భామ. అయితే చైతూతో ప్రేమవిషయం బయటకు పొక్కిన తర్వాత సినిమాలకు దూరం అవుతున్నానంటూ చెప్పుకొచ్చిన ఈ చెన్నై సుందరి మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయిపొయింది.

మాటల మాంత్రికుడితో ఇప్పటికే మూడు సినిమాలు చేసిన సమంత, త్రివిక్రమ్ – పవన్ కలయికలో రానున్న మూడు సినిమాలోనూ నటించనుంది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న తెలుగు సినిమా ఇదొక్కటే. కాగా తమిళంలో మాత్రం మూడు సినిమాలు చేస్తోంది. ఇప్పటికే విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇరంబుతిరై’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సామ్ శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేయనున్నట్టు ఇటీవల ‘రెమో’ తెలుగులో ఆడియో వేడుకలో చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరు హీరోలతో పాటు విజయ్ సేతుపతికి జోడీగాను సమంత నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ‘అరణ్య కాండం’తో అందరినీ మెప్పించిన కుమార్ రాజా విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా చేయనున్నారు ఇందులో నాయిక పాత్రధారి సమంతేనట. చేయనంటూనే ఎన్ని సినిమాలకు సంతకం చేసిందో చూశారుగా..!

https://www.youtube.com/watch?v=fAWhhnEgfq8

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus