తన మామ సినిమా షూటింగ్ లో జాయినయిన సమంత..!

కింగ్ నాగార్జున కెరీర్లో ‘ఆల్ టైం హిట్’ గా నిలిచిన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘మన్మథుడు 2’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం ‘పోర్చుగల్’ లో జరుగుతుంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కామెడీ ఓ రేంజ్లో ఉండబోతుందట. ‘మన్మధుడు’ చిత్రంలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఎంత ఆకట్టుకుందో.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కామెడీ అంత ఆకట్టుకుంటుందని సమాచారం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నాడు.

ఇప్పటీకే ఈ చిత్రానికి సంబందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ టీం అంతా చేసే హడావిడి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో.. ఫోటోలు, వీడియోల రూపంలో బయటకి వస్తూనే వున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో నాగార్జున పెద్ద కోడలు సమంత ఓ ప్రత్యేక పాత్రలో పోషించబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది నిజమా? కాదా? అనే సందేహంలో ఫ్యాన్స్ ఇప్పటివరకూ కన్ఫ్యూషన్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ సందేహాలను తెరదించేస్తూ ఈ సినిమా షూటింగులో సమంత జాయినవ్వడం విశేషం. ‘పోర్చుగల్’లో జరుగుతున్న షూటింగులో సమంత తాజాగా షూటింగ్ లో జాయినైంది. అయితే నాగచైతన్య కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొచ్చాయి.. మరి ఆ విషయం పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. ‘అన్నపూర్ణ స్టూడియోస్’, ‘మనం ఎంటర్ప్రైజెస్’ బ్యానెర్ల పై ఈ చిత్రం రూపొందుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus