నేను కూడా అవే తింటాను.. సమంత స్ట్రాంగ్ రిప్లై..!

ఇటీవల సమంత ‘కుర్ కురే’ ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్లు ఆమెని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ‘ఇది ఆరోగ్యానికి హానికరమైన ప్రొడక్ట్… దయచేసి ఇలాంటి వాటిని ప్రమోట్ చేయొద్దు’ అని కొందరు కామెంట్లు పెడుతుంటే… డబ్బు కోసం ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసేస్తావా అంటూ మరికొందరు సమంత పై తమ ఆగ్రహాం వ్యక్తం చేసారు. సమంత లాంటి యాక్టర్లు, మోడల్స్ సలాడ్స్, వంటి ఆరోగ్య కరమైన ఆహరం తీసుకుంటూ… అందంగా, ఫిట్‌గా ఉంటారు. కానీ మనల్ని మాత్రం ఇలా ఆనారోగ్యానికి పడేసే జంక్ ఫుడ్ తినాలని ప్రోత్సహిస్తున్నారు… అంతేకాదు దీనిని ప్రమోట్ చేస్తున్న సమంత… కనీసం ఒక్క ప్యాకెట్ అయినా పూర్తిగా తింటుందా? వాళ్ళకు ఆరోగ్యం మీద, ఫిట్‌నెస్ మీదే శ్రద్ధ ఉంటుంది. సాధారణ ప్రజల గురించి, వారి ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. అందుకే ఇలాంటి జంక్ ఫుడ్ తినేలా ప్రచారం చేస్తుంది… అంటూ ఓ నెటిజన్ మండిపడ్డాడు.

దీనికి వెంటనే తన ట్విట్టర్ ద్వారా సమంత బదులిస్తూ… “నేను కూడా వాటిని తింటాను… అందుకే ప్రమోట్ చేస్తున్నాను. ఆదివారం పూట నేను తినే లంచ్ ఫోటోలు మీకు పంపుతాను. ఎక్కువగా నియమాలతో కూడిన హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పటికీ బోర్ కొట్టినప్పుడు కుర్‌కురే లాంటి స్నాక్స్ తింటాను అంటూ సమంత బదులిచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత నటించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ అలాగే తన భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus