అప్పుడే రిటైర్మెంట్ గురించి చెప్పేసి షాకిచ్చింది..!

అవును సమంత సినిమాల నుండీ రిటైర్ అవుతుందట. స్వయంగా సమంతే ఈ కామెంట్స్ చేసి అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం ‘ఓ బేబీ’ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత. ఆ చిత్ర సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతుంది. ఇక సమంత అభిమానులు కూడా ‘ఓ బేబీ’ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి టైములో ఇలాంటి వార్త బయటకి రావడం.. వారిని కలవరపెడుతుంది. పెళ్ళయ్యాక కూడా సమంత సినిమాల్లో నటిస్తుందని… ఆ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ గతంలో ఆమె భర్త నాగచైతన్య చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే సమంత సినిమాల్లో నటిస్తూనే వచ్చింది. కథాబలం ఉన్న పాత్రల్ని ఎంచుకుంటూ మరింత సక్సెస్ ఫుల్ గా సమంత దూసుకుపోతుంది కూడా.

ఇదిలా ఉండగా…’సమంత ‘ఓ బేబీ’ షూటింగ్ సమయంలో ఇలాంటి సినిమా చేసిన తర్వాత నెక్ట్స్ ఏం చెయ్యాలి.. ఎలాంటి సినిమా చేయాలనే కన్ఫ్యూజన్ నాలో మొదలైపోయింది. నేను ఇక రిటైర్మెంట్ తీసుకోవాలేమో’ అని నందినీ రెడ్డి తో అన్నాను. అయితే అప్పుడే కాదు. నేను తల్లైన తరువాత… సినిమాలకు దూరంగా ఉంటాను. పూర్తిగా నా బేబీతోనే నేను గడుపుతాను. నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను. నా పిల్లలకి అలాంటి కష్టాలు రానివ్వను’ అంటూ సమంత తెలిపింది. అంటే ఆమె తల్లైన తరువాతే సినిమాల నుండీ రిటైరవుతుందని చెప్పకనే చెప్పింది. అయితే అందుకు చాలా టైం ఉందని కూడా చెప్పింది. కాబట్టి సమంత అభిమానులు.. కంగారుపడకండి…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus