Samantha, Allu Arjun: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బన్నీ, సామ్!

స్టార్ హీరో అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్, సమంత వేర్వేరుగా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది ఎక్కువసార్లు సెర్చ్ అయిన పేర్లలో బన్నీ, సామ్ స్థానం సంపాదించుకోవడం గమనార్హం. యాహూ 2021 సంవత్సరం గురించి రివ్యూ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఎక్కువసార్లు సెర్చ్ బార్ లో టైప్ అయిన పేర్లలో సిద్దార్థ్ శుక్లా తొలి స్థానంలో సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో ఉండగా అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నారు. మూడో స్థానం అల్లు అర్జున్ కు దక్కడంతో అతని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో పాపులర్ అయ్యారు. బన్నీ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప త్వరలో రిలీజ్ కానుంది. ఈ జాబితాలో నాలుగో స్థానంలో పునీత్ నిలిచారు.

ఫిమేల్ సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే తొలి స్థానంలో కరీనా కపూర్ నిలవగా రెండో స్థానంలో ప్రియాంక చోప్రా పదో స్థానంలో సమంత ఉన్నారు. విడాకుల ప్రకటన తర్వాత అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ సమంత వార్తల్లో నిలుస్తున్నారు. సమంత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus