చేతిపై ఉన్న టాటు గురించి వివరించిన సమంత, చైతూ

ప్రేమించిన వ్యక్తి పేరుని టాటూగా వేసుకోవడం కామన్. ప్రియుడు ఇష్టంగా వేసుకున్న పచ్చబొట్టును ప్రియురాలు తన శరీరంపై ముద్రించుకుంటే స్పెషల్. రెండో విధంగా చేసి టాలీవుడ్ ప్రేమజంట ప్రత్యేకతను చాటుకుంది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య చేతి మణికట్టుపైన “ప్లే” చిహ్నాన్ని టాటూగా వేయించుకున్నారు. అతని ప్రేమలో పడిన క్రేజీ నటి సమంత చేతిపైన కూడా “ప్లే” సింబల్ టాటు కనిపించింది. తామిద్దరం ప్రేముకులమని చైతు, స్యామ్ మీడియా ముందు ఒప్పుకోవడంతో తాజాగా వారి చేతులపై వేయించుకున్న టాటూ గురించి ప్రస్తావనకు వచ్చింది.

వేర్వేరు షో లలో పాల్గొన్న ఈ ప్రేమ పక్షులను టాటు ప్రశ్న అడిగారు. వారిద్దరూ ఒకే విధంగా సమాధానం ఇచ్చి బెస్ట్ లవర్స్ అనిపించుకున్నారు. ఇంతకీ వారు చెప్పిన అర్ధం ఏంటో తెలుసా..”మనకు మనమే ఓ సొంత రియాలిటీ ప్రపంచాన్ని సృష్టించుకోవాలి”… ఇద్దరి ఆలోచనలు ఈ మాటకు దగ్గరగా ఉండడంతో ఆ టాటు వేసుకున్నట్లు వివరించారు. సమంత, నాగచైతన్య వచ్చే ఏడాది పెళ్లి పీటలపై కూర్చోనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus