Samantha: ఇంకెన్నాళ్లీ ‘క్లిక్‌’ బైట్‌లు.. ఓపెన్‌ అవ్వొచ్చుగా సామ్‌.. ఎందుకని ఇలా?

ప్రముఖ కథానాయిక సమంత, ప్రముఖ దర్శకనిర్మాత రాజ్‌ నిడిమోరు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి నిజమో కాదో చెప్పడం లేదు కానీ అప్పుడప్పుడు ‘క్లిక్‌’లు ఇస్తున్నారు ఇద్దరూ. డేట్‌లకు వెళ్తున్నారో, సరదాగా తిరుగుతున్నారో తెలియదు కానీ తరచుగా బయట కనిపిస్తున్నారు. బాగా క్లోజ్‌ ఫ్రెండ్స్‌లా చెట్టాపట్టాలేసుకొని ఆ మధ్య కొన్ని ఫొటోలు కనిపించాయి. ఇప్పుడు మరోసారి అలాంటి వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో రాజ్‌, సమంత ఒకే కారులో కనిపించారు.

Samantha

సమంత, రాజ్‌ నిడిమోరు కలసి ఓ రెస్టారంట్‌కు డిన్నర్‌కు వెళ్లినట్లు ఆ వీడియో బట్టి తెలుస్తోంది. సమంత క్యాజువల్‌ వైట్‌ డ్రెస్‌లో నవ్వుతూ కనిపించగా, రాజ్‌ ఎప్పటిలా క్యాజువల్‌గానే కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య ఏముంది అనే ప్రశ్న మరోసారి బయటకు వచ్చింది. ఏమైనా ఉంటే ఓపెన్‌ అయిపోండి మాకెందుకీ ‘క్లిక్‌’ బైట్‌లు.. క్లారిటీ ఇస్తే అదే మాట అనుకుంటాం కదా అని సామ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ విషయంలో రాజ్‌ భార్య శ్యామాలి ఏం పోస్టు పెడతారో అనే ఆసక్తి కూడా ఉంది.

రాజ్‌ – డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌ సిరీసుల్లో సమంత నటించింది. అలా రాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహంగా కొనసాగిన ఈ బంధం ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు తేలుతోంది. అయితే అంతా ఇలా ప్రచారం అయ్యాక తూచ్‌ మా మధ్య ఏమీ లేదు, మేం స్నేహితులం అని సమంత చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అయితే సమంత తన బంధం గురించి, బంధం బీటలు వారడం గురించి ఇలా సోషల్‌ మీడియాలో తొలుత లీకులు ఇచ్చి ఆ తర్వాత అఫీషియల్‌గా చెబుతూ ఉంటుంది. గతంలో నాగచైతన్యతో బంధం, విడాకులు గురించి అభిమానులుల, ప్రేక్షకులకు ఇలా లీకుల రూపంలోనే తెలిసింది.

“కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus