Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విజయ్ దేవరకొండ (Hero)
  • భాగ్యశ్రీ బోర్సే (Heroine)
  • సత్యదేవ్, వెంకిటేష్, మనీష్ చౌదరి తదితరులు.. (Cast)
  • గౌతమ్ తిన్ననూరి (Director)
  • నాగవంశీ - సాయి సౌజన్య (Producer)
  • అనిరుధ్ రవిచంద్రన్ (Music)
  • గిరీష్ - జొమోన్ (Cinematography)
  • నవీన్ నూలి (Editor)
  • Release Date : జూలై 31, 2025
  • సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ - శ్రీకార స్టూడియోస్ (Banner)

“జెర్సీ” అనంతరం గౌతమ్ నుంచి మరో సినిమా వస్తుందంటే ప్రేక్షకలోకం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. అందులోనూ హీరో విజయ్ దేవరకొండ అనేసరికి ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ఇక “అవసరమైన మొత్తం తగలబెట్టేస్తా” అంటూ రిలీజ్ చేసిన టీజర్లు సినిమా మీద విశేషమైన అంచనాలు నమోదు చేశాయి. మరి “కింగ్డమ్” ఆ అంచనాలు అందుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

Kingdom Review

కథ: 

 

అంకాపూర్ లో ఓ చిన్న కానిస్టేబుల్ సూరి (విజయ్ దేవరకొండ). తన అన్న కోసం వెతికే ప్రయత్నంలో ఓసారీ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి.. అక్కడ సీనియర్ ఆఫీసర్ పై చేయి చేసుకొని పెద్ద తలకాయల కంట్లో పడతాడు.

అనుకోని విధంగా ఓ సీనియర్ ఆఫీసర్ (మనీష్ చౌదరి) సూరిని శ్రీలంకలోని ఒక స్పెషల్ ఆపరేషన్ కోసం సెలక్ట్ చేసి అక్కడికి పంపుతాడు.

ఆ ఆపరేషన్ తో తనకేం సంబంధం లేకపోయినా.. తన అన్నయ్య శివ (సత్యదేవ్)ను కలిసే అవకాశం కోసం గుడ్డిగా స్పైగా శ్రీలంలోకి ఎంటర్ అవుతాడు.

శ్రీలంకలో సూరికి అక్కడ డాన్ కొడుకైన మురుగన్ (వెంకిటేష్) ముఖ్యమైన అడ్డంకిగా మారతాడు.

ఈ అడ్డంకులన్నీ ఎదుర్కొని సూరి తన అన్నను వెనక్కి తెచ్చుకోగలిగాడా? మురుగన్ ను ఏ విధంగా ఎదిరించాడు? ఇండియన్ గవర్నమెంట్ అతడికి సపోర్ట్ గా నిలిచిందా? ఇంతకీ కింగ్డమ్ ఎవరిది? దాని రాజు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

నటీనటుల పనితీరు: 

సినిమాలోని ప్రతి ఒక్క నటుడు వారి పాత్రల్లో జీవించేసారని చెప్పాలి. సూరిగా విజయ్ దేవరకొండ, శివగా సత్యదేవ్, అను పాత్రలో భాగ్యశ్రీ, సీనియర్ ఆఫీసర్ గా మనీష్ చౌదరి చాలా చక్కని నటన కనబరిచారు.

అయితే.. వీళ్ళందరిలో ఏ ఒక్కరి పాత్రకి సరైన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ & ఆర్క్ లేకపోవడం అనేది మైనస్. శివ పాత్ర ఆ ట్రైబ్ కి ఎందుకు అంతలా దగ్గరయ్యింది? ఎందుకని ఒక్కసారి కూడా తమ్ముడిని, తల్లిని చూడడానికి వెనక్కి వెళ్లలేకపోయాడు? అనేది జస్టిఫై చేయలేదు.

ఇక మనీష్ చౌదరి క్యారెక్టర్ గోల్ ఏంటి? ఎందుకని ఇలా చేస్తున్నాడు? అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు:

అనిరుధ్ సంగీతం, గిరీష్-జోమోన్ సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం పీక్ లెవల్లో ఉన్నాయి. కథకు అవసరమైన దానికంటే అద్భుతమైన క్వాలిటీ ఉంది సినిమాలో. ముఖ్యంగా ఓపెనింగ్ సీక్వెన్స్ ను పిక్చరైజ్ చేసిన విధానం అదిరిపోయింది. అలాగే టైటిల్ కార్డ్స్ డిజైన్ క్వాలిటీ కూడా బాగుంది. వీటన్నిటికంటే.. కలర్ గ్రేడింగ్ & డి.ఐ మీద మేకర్స్ చాలా ఖర్చు చేసినట్లు కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ చాలా క్లీన్ & నీట్ గా కనిపించింది. క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అని అర్థమైంది.

దర్శకుడు గౌతమ్ నుంచి ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసేదే మంచి డ్రామా. అందులోనూ “జెర్సీ” తర్వాత సినిమా కాబట్టి, “కింగ్డమ్”లోనూ మంచి అన్నదమ్ముల బాండింగ్ ఉంటుంది, వారి మధ్య మంచి ఎమోషనల్ సీక్వెన్సులు ఉంటాయి అనుకుంటాం. కట్ చేస్తే.. కథలో యాక్షన్ ను ఇరికించి డ్రామాను పక్కన పెట్టేశాడు గౌతమ్. ఎన్నో అంచనాలు ఉన్న జైల్ ఎపిసోడ్, సత్యదేవ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ సీన్స్ చాలా పేలవంగా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సులు టెక్నికల్ గా బాగున్నప్పటికీ.. ఎమోషనల్ కనెక్టివిటీ లేక ఆడియన్స్ ను కావాల్సిన విధమైన హై ఇవ్వవు. దర్శకుడిగా తనలోని మరో కోణాన్ని పరిచయం చేద్దామనే ఆతృతతో, తన బలమైన జోన్ అయిన డ్రామాను గౌతమ్ పక్కన పెట్టడమే సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచింది. ఓవరాల్ గా.. దర్శకుడిగా, రచయితగా గౌతమ్ పూర్తిస్థాయిలో అలరించలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ: 

సినిమాలో ఎలాంటి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేయాలి అనేది రివీల్ చేస్తూ ప్రమోట్ చేయడం అనేది చాలా క్రూషియల్. “గుంటూరు కారం”తో దెబ్బతిన్న వంశీ కంటే ఈ విషయం మరెవరికీ ఎక్కువగా తెలియదు. అలాంటిది.. అతడే మళ్లీ ఆ మిస్టేక్ ను “కింగ్డమ్”తో రిపీట్ చేయడం గమనార్హం. పైపెచ్చు గౌతమ్ సినిమాల్లో కనిపించే ఒరిజినాలిటీ “కింగ్డమ్”లో లోపించింది. చాలా తెలుగు, తమిళ సినిమాలు గుర్తుకొస్తుంటాయి. ముఖ్యంగా పార్ట్ 2 కోసం ఇచ్చిన లీడ్ అంత ఆసక్తికరంగానూ లేదు. ఓ బ్లాక్ బస్టర్ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలన్న విజయ్ దేవరకొండ ఆశ తీరడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది.

ఫోకస్ పాయింట్: రాజు కోసం వేచి చూసిన దివికి తీరని దిగులు!

రేటింగ్: 2.5/5

ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

 

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus