Samantha: బాలీవుడ్‌లో పాగా వేయడానికి సామ్‌ ప్లాన్స్‌ ఇవేనట!

రిలేషన్‌ బ్రేకప్‌ తర్వాత హీరోయిన్లకు వరుస అవకాశాలు వస్తున్నాయని మొన్నీ మధ్య అనుకున్నాం గుర్తుందా? ఇప్పుడు సమంత అదే పనిలో ఉంది. తెలుగు, తమిళంలోనే కాదు ఇప్పుడు బాలీవుడ్‌లో తన ప్రతిభ చాటాలని చూస్తోంది. నిజానికి సమంత బాలీవుడ్‌ ఎంట్రీ అయిపోయింది.. అయితే ఓటీటీతో. ఇప్పుడు పెద్ద తెర మీద కూడా తన సత్తా చాటలని సమంత ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. దీని కోసం పనులు కూడా మొదలయ్యాయట. సమంత.. ముంబయి వెళ్లిపోతుంది అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి.

దీనిపై అప్పుడు క్లారిటీ దొరకలేదు. అయితే ఇప్పుడు సమంత ఏకంగా బాలీవుడ్‌ ఓ ఇల్లు కొనుక్కుందని టాక్‌. అంతే కాదు అక్కడ ఓ పీఆర్‌ను పట్టుకుందట. ఇప్పుడు బాలీవుడ్‌ అవకాశాల వేట షురూ చేయబోతోందట. బాలీవుడ్‌లో హీరోయిన్లకు కొదవలేదు కానీ… కొత్త నాయికలు వస్తే ఆదరించడం మాత్రం మానరు. రకుల్‌ ప్రీత్ సింగ్‌, రష్మిక మందన, పూజా హెగ్డే ఇలా వెళ్లినవారే. ఇప్పుడు వారి దారిలో సమంత కూడా వరుస ఛాన్స్‌లు కొట్టేసే పనిలో ఉందట.

గ్లామర్‌ షో విషయంలో సమంత ఏనాడూ అడ్డు చెప్పలేదు. ఇక లాంగ్వేజ్‌ బారియర్‌ ఎలాగూ ఉండదు. సౌత్‌ నాయికలతో సినిమాలు చేయడానికి ఈ మధ్య బాలీవుడ్‌ హీరోలు ఆసక్తి కూడా చూపిస్తున్నారు. దీంతో సమంతకు అవకాశాలు సులభంగానే దక్కుతాయనే వాదన కూడా వినిపిస్తోంది. మరి తొలి సంతకం ఏ సినిమాకో చూడాలి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus