టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన భర్త నాగచైతన్యతో విడిపోతుందని రూమర్లు షికార్లు చేస్తున్నారు. ఇప్పటివరకు సామ్ కానీ చైతు కానీ ఈ విషయంపై స్పందించలేదు. దీంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇప్పటికే మీడియాలో సమంత వైవాహిక జీవితం గురించి పలు వార్తలు వస్తున్నాయి. ఆమె ముంబైలో ఇల్లు కొనుక్కుందని.. చైతుతో విడిపోయి అక్కడికి వెళ్లిపోవాలనుకుంటుందని ఓ వార్త చక్కర్లు కొట్టింది. తాజాగా ముంబై షిఫ్టింగ్ పై సమంత స్పందించింది.
ఈ బ్యూటీ ‘సాకి’ క్లోతింగ్ బ్రాండ్ మొదలుపెట్టి ఏడాది కావొస్తున్న సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘మీరు నిజంగానే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా..?’ అని ప్రశ్నించాడు. దానికి సమంత స్పందిస్తూ.. హైదరాబాదే తన ఇళ్లని చెప్పింది. అసలు ఈ రూమర్స్ ఎక్కడ నుంచి మొదలవుతాయో అర్ధం కాదని.. అన్ని రూమర్లలానే ఈ రూమర్ లో కూడా నిజం లేదని చెప్పింది. ఇప్పటికీ, ఎప్పటికీ హైదరాబాదే తన ఇళ్లని చెప్పింది.
హైదరాబాద్ తనకు అన్నీ ఇచ్చిందని.. కాబట్టి అక్కడే జీవిస్తానని చెప్పింది. రీసెంట్ గా ఓ జ్యోతిష్కుడు సమంత-నాగచైతన్య విడిపోతారని.. ఆ తరువాత సమంత ముంబైలో సెటిల్ అవుతుందని కొన్ని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.