టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంతకు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్న సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా సమంత తన కెరీర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. బాల్యంలో అనుభవించిన కష్టాలను సమంత అభిమానులతో పంచుకున్నారు. నేను చదువుకునే సమయంలో అమ్మ, నాన్న కష్టపడి చదివించి పెద్దదానిని చేయాలని భావించారని సమంత తెలిపారు.
నేను కూడా కష్టపడి చదివానని సమంత చెప్పుకొచ్చారు. 10వ తరగతి, 12వ తరగతిలో నేను క్లాస్ టాపర్ అని సమంత కామెంట్లు చేశారు. అయితే ఉన్నత విద్య చదవటానికి మాత్రం నా తల్లీదండ్రుల దగ్గర డబ్బు లేకుండా పోయిందని సమంత చెప్పుకొచ్చారు. ఫలితంగా నా కలలకు గమ్యం లేదని భవిష్యత్ కూడా లేదని సమంత చెప్పుకొచ్చారు. పేరెంట్స్ ఆశించే మార్గంలో పిల్లలు నడవాలని సమంత అన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలని సమంత సూచనలు చేశారు. ఆ లక్ష్యాలను చేధించటంలో విద్యార్థులు నిమగ్నం కావాలని సమంత చెప్పుకొచ్చారు. లైఫ్ లో కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయని అయితే మన గమ్యాలను చేరుకునే ప్రయాణాన్ని మాత్రం ఆపవద్దని సమంత అన్నారు. తాను రెండు నెలల పాటు రోజులో ఒక పూట మాత్రమే భోజనం చేశానని ఆమె అన్నారు. నేను ఉద్యోగాలు చేశానని చివరగా ఈరోజు ఇక్కడ ఉన్నానని సమంత తెలిపారు.
సమంత నటించిన యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి. భిన్నమైన కథాంశాలతో ఈ మూడు సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం. మరోవైపు ఖుషీ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. సినిమాసినిమాకు సమంత రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.