ఇంటిపేరు మార్చుకొన్న సమంత

  • October 12, 2017 / 05:37 AM IST

ఈ ప్రపంచంలో మరెవ్వరికీ లేని అదృష్టం ఆడపిల్లలకు మాత్రమే ఉంది. అదేంటంటే.. రెండు ఇంటిపేర్లు. పాపం మగాడు పుట్టినప్పట్నుంచి చచ్చేంతవరకూ ఒకే ఇంటిపేరు ఒంటి పేరు మెయింటైన్ చేస్తే.. అమ్మాయిలు మాత్రం పెళ్ళికి ముందో ఇంటిపేరు, పెళ్లి తర్వాత మరో ఇంటిపేరు మార్చుకొని సంతోషాన్ని సరికొత్త ఇంట్లో పంచుతుంటారు. ఇప్పుడు సమంత అదే పనిలో ఉంది. అక్టోబర్ 6కి ముందువరకూ సమంత రుత్ ప్రభుగా అందరినీ అలరించిన సమంత.. ఇవాళ అక్కినేని సమంతగా మారింది. ఇప్పటికే తన ట్విట్టర్ ఎకౌంట్ లో ఆల్రెడీ అక్కినేని సమంత అని పేరు మార్చేసుకొన్న సమంత ఇప్పటికే ఫేస్ బుక్ కు కూడా అర్జీ పెట్టుకొంది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే ఫేస్ బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లోనూ అక్కినేని సమంత అనే కనిపిస్తుంది.

ఇకపోతే.. సమంత నటించిన తాజా చిత్రం “మెర్సల్” (తెలుగులో “అదిరింది”) అక్టోబర్ 18న విడుదలకానుంది. అలాగే.. సమంత కీలకపాత్ర పోషించిన “రాజుగారి గది 2” ఈ శుక్రవారం అనగా అక్టోబర్ 13న విడుదలకానుంది. పెళ్లై కనీసం వారం కూడా కాకముందే సమంత ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొంటుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus