Jr NTR, Samantha: ఎన్టీఆర్ పై చిరుకోపం ప్రదర్శించిన సమంత!

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో జెమినీ ఛానల్ లో ప్రసారం అవుతున్న షోకు పరవాలేదనిపించే స్థాయిలో రేటింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు చరణ్, రాజమౌళి, కొరటాల శివ సెలబ్రిటీ గెస్టులుగా హాజరయ్యారు. రెండు రోజుల క్రితం స్టార్ హీరోయిన్ సమంత ఈ షోకు హాజరైనట్టు ఒక ఫోటో వైరల్ అయింది. అయితే సమంత హాజరైన ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందనే వివరాలు మాత్రం తెలియలేదు.

తాజాగా జెమిని ఛానల్ నిర్వాహకులు సమంత హాజరైన ప్రోమోను రిలీజ్ చేయగా ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సమంత హాజరైన ఎపిసోడ్ ఈ నెల 14వ తేదీన ప్రసారం కానుందని తెలుస్తోంది. తనకు హాట్ సీట్ లో కూర్చుంటే భయంగా ఉందని సమంత చెప్పగా భయంగా ఉంటుందని ఇది హోస్ట్ సీట్ అది హాట్ సీట్ అని తారక్ వెల్లడిస్తారు. సాధారణంగా ఎవరైనా 1000 నుంచి కోటికి వెళతారని సమంత మాత్రం కోటి నుంచి 1000కు వస్తారంటూ తారక్ సరదాగా కామెంట్లు చేశారు.

ఆ తర్వాత సమంత తనకు డబ్బు వద్దని చెప్పి ఆ తర్వాత కావాలి కావాలి అంటూ తారక్ కు సమాధానం ఇస్తారు. క్విట్ అవుతారా అని ఎన్టీఆర్ అడగగా మీరు ఇప్పుడు చెబుతున్నారని ముందే చెప్పాలి కదా అంటూ సమంత చిరుకోపం ప్రదర్శిస్తారు. గురువారం రోజున ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కు మంచి రేటింగ్స్ వస్తాయని జెమిని ఛానల్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ షో సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రసారం కానుంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!


సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus