పొగిడినా తప్పేనా… రకుల్ ఫోటోకి సమంత కామెంట్ పెట్టి .. బుక్కయ్యింది…!

ట్రోలింగ్ అనేది ఇప్పట్లో సర్వసాధారణం అని అందరూ ఫిక్సయిపోయారు. స్టార్ హీరోయిన్లకు ఇది బాగా అలవాటు అయిపొయింది. అయితే ఒక్కోసారి ఈ ట్రోలింగ్ శృతి మించుతుందనే భావన అందరిలోనూ ఉంది. వట్టి పుణ్యానికి ట్రోల్స్ కు గురవుతున్న హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులో సమంత కూడా చేరింది. అసలు విషయం ఏంటంటే… తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. దానికి సమంత ‘ఆమేజ్ బాల్స్’ అని కామెంట్ పెట్టింది.

అంటే చాలా ‘ఇంప్రెసీవ్’ ‘అమేజింగ్’ అని అర్ధం వస్తుంది. ఇది అర్థం కాని చాలా మంది రకుల్ అభిమానులు, నెటిజన్లు… రకుల్ ను సమంత ఏదో అనేసిందని ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. కనీసం ట్రోలింగ్ మొదలు పెట్టే ముందు నెటిజన్లు ‘గూగుల్ సెర్చ్’ లో దాని అర్ధం ఏంటనేది చెక్ చేసుకుంటే బెటర్. ఏదైతేనేం.. వట్టి పుణ్యానికి సమంత బలైపోయింది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus