బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్… వీటన్నింటి మధ్య తేడా భాష ఒక్కటే అంటుంటారు కొంతమంది హీరోయిన్లు. భాషతో పనేముంది భావం ముఖ్యం కాబట్టి అన్ని ‘వుడ్’లు ఒక్కటే అంటుంటారు ఇంకొరు హీరోయిన్లు. అయితే బాలీవుడ్‌లో ఉన్న ఓ విషయం, టాలీవుడ్‌లో ఉండదు అంటోంది సమంత. తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను వెలగబెట్టి… ప్రస్తుతం సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటోంది సమంత. ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో ఓటీటీలో కూడా అడుగుపెట్టింది. అయితే ఇంకా అది లైవ్ కాలేదనుకోండి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌పై సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.
‘‘బాలీవుడ్ లో హీరో, హీరోయిన్లు ఎలాంటి పాత్రల్లో నటించినా చూస్తారు. కానీ దక్షిణాదిలో ఏదైనా ఒక జోనర్‌లో సినిమా చేస్తే… ఇక ఆ జోనర్‌లోనే కొనసాగాలి. మరో జోనర్‌లో నటిస్తే ప్రేక్షకులు తీసుకోలేరు. ఓ హీరోయిన్ బాలీవుడ్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం పెద్ద సమస్య కాదు. కానీ దక్షిణాదిలో అలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులు అంత త్వరగా అంగీకరించరు. అందుకే బాలీవుడ్‌లో ఉన్న స్వేచ్చ దక్షిణ చిత్ర పరిశ్రమలో ఉండదు’’ అని చెప్పింది. అయితే ఆమె చేసిన సినిమాలు చూస్తే ఆమె చెప్పిన అంత నిజం అని అనలేం. తెలుగులో స్టార్ హీరోల పక్కన చేసి, స్టార్ హీరోయిన్‌గా నిలిచింది సమంత.
ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా చేసింది. ‘రంగస్థలం’ లాంటి సినిమాలో విలేజ్ అమ్మాయిగా కనిపించింది. ‘యూ టర్న్’లో మెయిన్ రోల్ చేసింది. ‘ఓబేబీ’ సంగతైతే చెప్పక్కర్లేదు. అలా చాలా రకాల జోనర్లు చేసి ఆకట్టుకున్న సమంత టాలీవుడ్‌లో ‘జోనర్’ స్వేచ్ఛ లేదనడం వెనుక ఉన్న కారణమేంటో తెలియడం లేదు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో నెగిటివ్ షేడ్స్ ఉండే పాకిస్తానీ అమ్మాయిగా సమంత కనిపించనుందని వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో వెబ్‌సిరీస్ బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు సిద్దమవుతుంది.
Most Recommended Video