Samantha: ఆ జ్ఞాపకాలను చేరిపేస్తున్న సమంత!

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత రూత్ ప్రభు దాదాపు 85 ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి తొలగించినట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత రూత్ ప్రభు సరికొత్త జర్నీని సాగిస్తోంది. తన ఆధ్యాత్మిక యాత్ర తర్వాత తన వ్యక్తిగత పర్యటనతో మరొక విహారయాత్రకు వెళ్ళింది. ఆమె రెగ్యులర్ గా ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేసుకుంటోంది. ఇక సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి నాగ చైతన్యతో ఉన్న 85 చిత్రాలను తొలగించడం

సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. సామ్ చైతో తన జ్ఞాపకాలన్నింటినీ చెరిపివేయాలనుకుంటోంది కాబట్టి ఇది కామన్ అని నెటిజన్లు అభిప్రాయాపడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విషయాల పై అనేక రకాల కథనాలు వెలువడడంతో సమంత కొంత అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.యూట్యూబ్ ఛానల్ లో అసభ్యకరంగా వార్తలు ప్రసారం చేయడంపై కూడా సమంత చాలా సీరియస్ అయ్యింది. ఆమె చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు.

వీలైనంత వరకు సమంత తన వ్యక్తిగత విషయంలో ప్రశాంతంగా ఉండాలని ఆలోచిస్తోంది. ఇక సినిమాకి కూడా హ్యాపీగా కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటోంది ప్రస్తుతం ఆమెకు లేడీ ఓరియంటెడ్ ఆఫర్స్ అయితే చాలానే వస్తున్నాయి. త్వరలోనే పాన్ ఇండియా ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను ఫినిష్ చేసింది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus