Samantha: సడెన్ గా దుబాయ్ వెళ్లిన సమంత.. కారణం అదేనా..!

సమంత సడన్ గా దుబాయ్ వెళ్ళింది. ఆమె సడెన్ ట్రిప్ కు కారణం ఏంటి? అనేది ఇప్పడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఏం చేసినా చర్చనీయాంశం అయ్యింది. ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ఆమె ఏమీ చేయకపోయినా… ఆమె పై సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. సరే.. సమంత దుబాయ్ కి ఎందుకు వెళ్లినట్టు? అనే విషయంలోకి వెళితే.. సమంతకి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో శిల్పారెడ్డి ఒకరు.

ఆమెతో అలాగే ఆమె సోద‌రి సాహిత్య రెడ్డితో కలిసి సరదాగా దుబాయ్ ట్రిప్ వేసినట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను శిల్పారెడ్డి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..”నా సోద‌రి సాహిత్య ను సమంత క‌ల‌వ‌డం, సామ్‌ను సాహిత్య మీట్ అవ్వడం అద్బుతంగా అనిపిస్తుంది.వీళ్ళు నా ఇద్ద‌రు ఫేవ‌రేట్ మహిళలు. దేవా ఎప్పుడూ సామ్ ఆంటీని కలుసుకోవడం చాలా సరదాగా ఉంటుంది..

అంటూ #dubaidaires హ్యాష్ ట్యాగ్‌తో ఫన్నీ కామెంట్స్ చేసింది. అంతేకాదు స‌మంత‌తో క‌లిసి దిగిన మ‌రో ఫొటోను షేర్ చేస్తూ..”దుబాయ్‌లో మేము ఇంకా ఎవరిని కలుసుకునే అవకాశం ఉందో ఊహించండి చూద్దాం”..అంటూ ఓ ప్రశ్న వేసి ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేసింది శిల్పారెడ్డి. ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత నటించిన ‘యశోద’ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. ‘శాకుంతలం’ కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

మరి ఆ సినిమా రిలీజ్ డేట్ విషయం పై క్లారిటీ లేదు. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సమంత నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానుంది. శివ‌నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. దీంతో పాటు ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా సమంత నటిస్తుంది. బాలీవుడ్లో కూడా ఓ బడా సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus