Samantha: మరోసారి హాట్ టాపిక్ అయిన సమంత కామెంట్లు..!

సమంత (Samantha) నుండి కొంత గ్యాప్ తర్వాత వచ్చిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ వెబ్ సిరీస్ గత వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది. దీని ప్రమోషన్లో భాగంగా సమంత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే… సమంత  నటించిన ‘సిటాడెల్ హనీ బెన్ని’ (వెబ్ సిరీస్) గత వారం ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్.. కి ఏమాత్రం తీసిపోని విధంగా ఇందులో సమంత ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి.

Samantha

వాటికి సోషల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇందులో మరోసారి తల్లి పాత్రలో కనిపించి మెప్పించింది సమంత. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా సమంత మాట్లాడుతూ..’నాకు తల్లి కావాలనే కోరిక ఉంది. అమ్మతనాన్ని నేను కూడా ఇష్టపడతాను. ఇందుకు లేట్ అయ్యింది అనే బాధ ఏమీ లేదు. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

‘రంగస్థలం’ (Rangasthalam) సినిమా నుండి సమంత ‘తల్లి కావాలని ఉంది’ అనే మాటని చెబుతూనే ఉంది. ఆ టైంలో ఆమె నాగ చైతన్యతో  (Naga Chaitanya) కలిసే ఉంది. కానీ తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగ చైతన్య ఎంగేజ్మెంట్.. శోభిత ధూళిపాళతో (Sobhita Dhulipala) జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు.

అయితే సమంత సంగతేంటి? అనే విషయంపై కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సమంత కూడా ఓ నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సమంత అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. రెండో పెళ్లి గురించి కూడా ఆమె ఓపెన్ అయ్యింది లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus