Samantha: వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై సామ్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వినేశ్ ఫొగాట్ పసిడి పతకం సాధిస్తుందని అందరూ భావించిన సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ వార్త విని ఎంతోమంది మన దేశ పౌరులు షాక్ కు గురయ్యారు. వినేశ్ ఫొగాట్ కు ధైర్యం చెబుతూ సెలబ్రిటీలు పోస్ట్ లు పెట్టగా ఆ పోస్ట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Samantha

సమంత (Samantha) వినేశ్ ఫొగాట్ అనర్హత వేటు గురించి స్పందిస్తూ కొన్ని సమయాల్లో ఎంతగానో పోరాడే వ్యక్తులు కఠినమైన అడ్డంకులను ఎదుర్కొంటారని మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. కష్టాల మధ్య కూడా నిలదొక్కుకునే మీ అద్భుతమైన ధైర్యం నిజంగా ప్రశంసనీయమని సమంత తెలిపారు. మీ కష్టసుఖాల్లో మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం అని సామ్ చెప్పుకొచ్చారు.

వినేశ్ ఫొగాట్ లో స్పూర్తి నింపే విధంగా సమంత చేసిన కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మరో హీరోయిన్ తాప్సీ స్పందిస్తూ అనర్హత వేటు వార్త హృదయం ముక్కలయ్యే వార్త అని తెలిపారు. కానీ వినేశ్ ఫొగాట్ ఇప్పటికే తన ప్రతిభతో స్వర్ణ పతకాన్ని మించిన పేరును సాధించారని తాప్సీ చెప్పుకొచ్చారు. స్టార్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ వినేశ్ ఫొగాట్ మా హృదయాలను గెలుచుకున్నారని అన్నారు.

మీరు నిలబడిన తీరు రానున్న తరాలకు స్పూర్తినిస్తుందని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. సెలబ్రిటీలు వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై స్పందిస్తూ ఆమెలో ధైర్యం నింపుతున్న తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. వినేశ్ ఫొగాట్ భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఓటమి విజయానికి తొలిమెట్టు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వినేశ్ ఫొగాట్ ఎంతో కష్టపడ్డారు కాబట్టే ఆ స్థాయికి వెళ్లారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus