Niharika Konidela: మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది స్పెషల్ అంటున్న నిహారిక.. ఏమైందంటే?

మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)  కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమా సక్సెస్ సాధించడానికి తన వంతు కష్టపడుతున్నారు. 2024 సంవత్సరం మెగా నామ సంవత్సరం అంటూ పరోక్షంగా ఆమె చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి అన్నీ అనుకూలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్నయ్య వరుణ్ తేజ్ (Varun Tej) సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని నిహారిక చెప్పుకొచ్చారు.

కమిటీ కుర్రోళ్లు డైరెక్టర్ వంశీ పేరు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ అంతటా మారు మ్రోగుతుందని నిహారిక కామెంట్లు చేశారు. 15 మంది కొత్త యాక్టర్లను సినిమా రంగానికి ఇచ్చాననే తృప్తిని మీరు నాకు ఇచ్చారని నిహారిక వెల్లడించారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆమె నమ్మకం వ్యక్తం చేయడం గమనార్హం. ఇది అతి విశ్వాసం కాదని ఈ ఏడాది మా ఫ్యామిలీకి అద్భుతంగా ఉందని నిహారిక తెలిపారు.

ఈ ఏడాది చరణ్ (Ram Charan) అన్న నటించిన ఆర్.ఆర్.ఆర్ (RRR) ఆస్కార్స్ కు వెళ్లిందని బాబాయ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం  అయ్యారని పెదనాన్నకు పద్మవిభూషణ్ వచ్చిందని నిహారిక పేర్కొన్నారు. నేను సైతం నిర్మాతగా ఫస్ట్ మూవీతో వస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఇలానే మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నానని నిహారిక తెలిపారు. కమిటీ కుర్రోళ్లు మూవీ సైతం సక్సెస్ సాధిస్తే నిహారిక కామెంట్లు నిజమేనని నమ్మవచ్చు.

ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా పెద్దగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిహారిక మాత్రం కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగడానికి తన వంతు కష్టపడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. నిహారికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. నిహారిక కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తుండటం కొసమెరుపు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus