Samantha: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ బ్యాన్ చేయాలంటూ డిమాండ్!

  • May 19, 2021 / 07:24 PM IST

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1 విడుదలయిన సమయంలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ మౌత్ టాక్ తో సిరీస్ కి క్రేజ్ పెరిగిపోయింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సీజన్ 2 రాబోతుంది. నిజానికి ఈపాటికే సీజన్ 2 రిలీజ్ కావాలి కానీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఓ పక్క దీనికి లక్షల్లో వ్యూస్ వస్తుందో మరో పక్క అదే రేంజ్ లో ట్రోలింగ్ కూడా జరుగుతోంది.

సీజన్ 2లో సమంత టెర్రరిస్టు పాత్రలో నటించనుందనే సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ట్రైలర్ లో సమంత క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. ఆమె LTTE కి చెందిన టెర్రరిస్ట్ గా కనిపించబోతుంది. తమిళనాడుకి చెందిన సమంత ఇలాంటి పాత్రలో కనిపిస్తుండడంతో తమిళులు ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. LTTE అనేది టెర్రరిస్ట్ గ్రూప్ కాదని.. తమిళ హక్కుల కోసం పోరాడిన ఆర్మీ అని.. అలాంటి తమిళ టైగర్స్ ను టెర్రరిస్ట్ ల మాదిరి చూపిస్తారా..? అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి సిరీస్ లో నటించడానికి సిగ్గుగా లేదా అంటూ సమంతను ప్రశ్నిస్తున్నారు.

ఈ సిరీస్ తో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్లాన్ చేసింది సమంత. కానీ ఈ ట్రోలింగ్ తో సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. ఇప్పటివరకు ఈ ట్రోలింగ్ పై అటు సమంత కానీ దర్శకనిర్మాతలు కానీ స్పందించలేదు. తమిళులు మాత్రం ఈ సిరీస్ రిలీజ్ చేయడానికి వీళ్లేదని.. పర్మనంట్ గా బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందు ఇలాంటి నెగెటివ్ ప్రచారం జరిగితే వీక్షకుల సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ లో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రలు పోషించారు.


టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus