Samantha: ఆ రెండింటికీ దూరంగా ఉంటానంటోన్న సమంత!

  • April 29, 2022 / 07:56 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. విడాకుల తరువాత మరిన్ని సినిమాలు ఊపుకొని కెరీర్ పరంగా చాలా బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా ఈమె నటించిన ‘కన్మణి రాంబో ఖతీజా’ అనే డబ్బింగ్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఇదిలా ఉండగా.. గురువారం నాడు సమంత పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, దర్శకనిర్మాతలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకి శుభాకాంక్షలు చెప్పారు.

Click Here To Watch NOW

తాజాగా సమంత తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించింది. ‘కన్మణి రాంబో ఖతీజా’ సినిమాలో తన ఫేవరెట్ సాంగ్ ‘డిప్పమ్ డిప్పమ్’ అని చెప్పింది సామ్. ఇక సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమాలో భాగం కావాలని ఈ సినిమా చేశానని చెప్పింది. తన కోస్టార్ నయనతార గురించి చెబుతూ.. నయనతారలా మరొకరు ఉండరని.. ఆమెలో ఒక ఫైర్ ఉంటుందని, నిజాయితీ ఉంటుందని..

తను కలిసిన వ్యక్తుల్లో బాగా కష్టపడి పని చేసే వ్యక్తుల్లో ఆమె ఒకరని చెప్పింది. అలానే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గురించి ప్రశ్నించగా.. అనిరుధ్ చాలా స్పెషల్ అని.. అతనొక జీనియస్ అని చెప్పింది. ఓ నెటిజన్.. ‘ఒకే సమయంలో ప్రేక్షకుల నుండి ప్రేమ, విపరీతమైన ద్వేషం రావడం ఎలా అనిపిస్తోందని..?’ ప్రశ్నించాడు. దానికి సమంత.. ‘ఆ రెండిటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను.. ప్రేమలోనూ, ద్వేషంలోనూ మునగాలని ప్రయత్నించను’ అంటూ చెప్పుకొచ్చింది. తన పుట్టినరోజు నాడు విష్ చేసి ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతూ.. అభిమానుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోనని చెప్పింది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus