తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్యూట్ కపుల్ గా ఉన్నవారిలో సమంత నాగచైతన్య జంట ఒకటిగా ఉండేది. ఎంతో అన్యోన్యంగా చూడముచ్చటగా ఉన్న ఈ జంట కొన్ని సంవత్సరాలపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నా చివరికి విడాకులతో విడిపోయారు. ఇకపోతే వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వీళ్ళు మాత్రం విడాకులకు కారణాలు మాత్రం తెలియజేయలేదు. సమంత నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడు నాగచైతన్య ఎదుగుదలను ప్రోత్సహించింది.
అదేవిధంగా అక్కినేని కుటుంబ పరువు మర్యాదల కోసమే తాను ఎన్నో త్యాగం చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే చైతన్య కెరియర్ విషయంలో సమంత అన్ని విషయాలు తానే దగ్గరుండి చూసుకుందట. ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న దూత వెబ్ సిరీస్ ముందుగా సమంతకు వినిపించారట. అయితే ఈ సిరీస్ సమంతకు తెగ నచ్చడంతో ఈ సిరీస్ చేయమని చైతన్యకు సమంత సలహా ఇచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
ఈ క్రమంలోనే సమంతనటుడిగా ఎదగాలి అంటే ఎన్నో వేరియేషన్స్ ఉండే పాత్రలో నటించాలని ఆమె చైతన్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ వెబ్ సిరీస్ పేపర్లపై నాగచైతన్యతో సంతకం చేయించారట. అలా నాగచైతన్య నటిస్తున్న దూత వెబ్ సిరీస్ కు కారణం సమంతనే అని తెలుస్తోంది. ఈ విధంగా సమంత నాగచైతన్య సినీ కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అతనిని ముందుకు నడిపించడం కోసం అహర్నిశలు కష్ట పడినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా అక్కినేని కుటుంబం కోసం కూడా సమంత కథల విషయంలో ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈమె చివరికి అక్కినేని కుటుంబాన్ని విడిచి రావాల్సి వచ్చింది.ప్రస్తుతం నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి సారించి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా గ్లామర్ షో చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.