టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు అదే విధంగా మరోవైపు తాను నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఇలా సమంత గత కొద్దిరోజులుగా మయో సైటిసిస్ వ్యాధి బారిన పడి పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో తాను కమిట్ అయిన సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే సమంత తిరిగి కోలుకోవడంతో ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులు అలాగే ప్రమోషన్ కార్యక్రమాలు అటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా క్షణం పాటు తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి సమంత ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తనకు దొరికిన సమయాన్ని తన కోసం ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఈమె కారులో ప్రయాణిస్తూ ఉండగానే తన మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడమే కాకుండా చేతిలో జపమాల పట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు.
ఇలా జర్నీలో కూడా తన సమయం వృధా కాకుండా ఉండడం కోసం ఇలా ఒక వైపు తన అందాన్ని పెంపొందించుకుంటూనే మరొకవైపు తన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ధ్యానం చేస్తూ కనిపించారు. ఇలా సమంత ఏ మాత్రం తన సమయాన్ని వృధా చేసుకోకుండా కారులోనే అన్ని పనులు కానిస్తూ ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ ఫోటోపై వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె (Samantha) సిటాడేల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అదే విధంగా ఖుషి సినిమా షూటింగ్ పనులలో కూడా సమంత ఎంతో బిజీగా గడుపుతున్నారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?