క్యూట్ బ్యూటీ సమంత ఈ ఏడాది తమిళం, తెలుగు భాషల్లో ఐదు చిత్రాలు చేసింది. అందులో నాలుగు బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సంవత్సరం నంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఇయర్ ఆమెకు కెరీర్ పరంగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలోను తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. తాను నాగచైతన్యను ప్రేమిస్తున్నట్లు ఈ ఏడాదే ఆమె వెల్లడించింది. వారిదద్దరి ప్రేమకు పెద్దలు అంగీకారం లభించడం కూడా జరిగిపోయాయి. అంతేకాదు కింగ్ నాగార్జున తన పెద్ద కోడలు సమంత అని మీడియా ముందు చెప్పడంతో ఆమె అక్కినేని కోడలిగా గౌరవం అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఇందులో ఆమె చైతూని ఏడిపించిన విషయాన్నీ వెల్లడించింది.
“డైరక్టర్ అట్లీ “తేరి” సినిమా కథ చెబుతున్నప్పుడు నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను. ముఖ్యంగా నేను చనిపోయే సన్నివేశం బాగా రావడానికి కష్టపడుతానని అప్పుడే చెప్పాను. థియేటర్లో అందరూ ఏడ్చేలా నా ప్రయత్నం చేశా. అది నిజంగా జరిగింది. ఆ సినిమా చూసేందుకు నా స్నేహితులు, చైతూతో కలిసి ఓ థియేటర్‌కు వెళ్లా. ఆ సీన్ వస్తున్నపుడు స్ర్కీన్ వైపు కాకుండా థియేటర్లో ఉన్న జనాల వైపు చూస్తూ కూర్చున్నా. ఆ సీన్ వస్తున్నపుడు అందరూ భావోద్వేగంతో ఉన్నారు. నా పక్కనే కూర్చున్న చైతూ కూడా ఆ సన్నివేశంలో నన్ను అలా చూసి ఏడ్చేశాడు.” అని చెప్పింది సమంత. తాను పెళ్లి చేసుకున్నా నటనకు గుడ్ బై చెప్పడం లేదని, వచ్చే ఏడాది తనవి ఐదు చిత్రాలు రానున్నట్లు స్పష్టం చేసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.