Samantha: నాగార్జునకు సమంత కోపం తెప్పించారా..?

  • May 27, 2021 / 09:23 PM IST

స్టార్ హీరో నాగార్జున వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో నాగార్జున ముందువరసలో ఉంటారు. అయితే ద ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ నాగార్జునకు కోపం తెప్పించిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ మ్యాన్ 2 అనేక వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సమంత పాత్ర వల్లే ఈ వివాదం పెద్దదవుతోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించగా ట్రైలర్ లో ఉన్న విధంగానే సినిమాలో పాత్ర ఉంటుందని కచ్చితంగా చెప్పలేము.

అయితే ఆమె పాత్ర గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమాల ద్వారా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోని సమంత తొలి వెబ్ సిరీస్ తోనే వివాదంలో చిక్కుకోవడం నాగార్జున అసహనానికి కారణమైందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సమంతను ట్రోల్ చేస్తున్న వారి విషయంలో కూడా నాగార్జున తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. కోడలిపై ట్రోలింగ్ తో నాగార్జున టెన్షన్ పడుతున్నారని సమంత వివాదాస్పద పాత్రలో నటించడం నాగార్జునకు నచ్చలేదని తెలుస్తోంది.

మరోవైపు అక్కినేని అభిమానుల నుంచి కూడా ఇవే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఎంచుకోవడంలో తప్పు లేకపోయినా ఇలాంటి పాత్రలు మాత్రం వద్దని ఫ్యాన్స్ సూచనలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం శాకుంతలం సినిమాలో నటిస్తున్న సమంత ఇకపై పాత్రల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus