నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర్నుండీ సమంత… రకరకాల కోట్స్ తో ఇన్స్టాగ్రామ్లో హల్ చల్ చేస్తుంది. ఇవి తనకి తాను పొగుడుకుంటున్నట్టు కనిపిస్తూనే మరోపక్క పరోక్షంగా ఎవరిపైనో సెటైర్లు వేసే విధంగా ఉంటున్నాయి. దీంతో నాగ చైతన్య ఫ్యాన్స్ సమంత పెట్టే క్వోట్స్ పై మండిపడుతున్నారు. అంతేకాదు అమ్మని అడ్డం పెట్టుకుని ఇలా ఒకరిని విమర్శించడం ఎందుకు? ధైర్యం, నిజాయితీ ఉంటే నేరుగా విమర్శించొచ్చు కదా. లేని పక్షంలో అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో కూడా తప్పు లేదు.
అందుకు అమ్మని ఎందుకు ఈ విషయాల్లోకి లాగడం? అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో సమంత తన అమ్మతో చేసిన చాట్ ను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. పర్సనల్ చాట్ ను హైడ్ చేసి క్వోట్స్ ఉన్నవాటిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది సామ్. దీంతో సమంత చెప్పింది నిజమే అని కొంతమంది అంటుంటే మరికొంతమంది మాత్రం ‘తన అమ్మ ఫోన్ తీసుకుని వాట్సాప్ నుండీ ఒకటి రెండు క్వోట్స్ పెట్టేస్తే నమ్మడానికి మీ అభిమానులం కాదు.. పిచ్చోళ్ళం కాదు’ అంటూ విరుచుకు పడుతున్నారు.
వాళ్ళు చెప్పింది కూడా పాయింటే కానీ సమంతని ట్రోల్ చెయ్యడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ అనుమానాలను పరిగణలోకి తీసుకోలేము.ఇక విడాకులనంతరం సమంత.. చైతన్య తన కోసం తీసుకున్న గచ్ఛబౌలిలోని ఇంట్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు చెన్నైలో ఉన్న తన పేరెంట్స్ వద్దకి వెళ్ళి వస్తుంది.