భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టనున్న అమ్మాయి

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంతని ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిమధ్య బంధం మరింత బలపడింది. అయితే వీరి మధ్యలోకి ఓ అమ్మాయి వచ్చి చిచ్చుపెట్టబోతోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణం కానుంది. ఏంటి చైతూ మరో అమ్మాయిని ప్రేమించాడా? ఆమె హీరోయినా? బయటి వ్యక్తా? అని ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే ఇది నిజజీవితంలో జరిగే కాదు.. వెండితెరపై సాగే స్టోరీ. ప్రస్తుతం సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు మూవీ చేస్తున్న చైతూ వీటి తర్వాత తన భార్య సమంతతో కలిసి మూవీ చేయనున్నారు. “నిన్నుకోరి” హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో పని చేయనున్నారు.

హరీశ్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాకి సమంత, నాగచైతన్య ఉమ్మడిగా ఏడుకోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇందులో సమంత, చైతూ భార్య భర్తల్లానే నటిస్తారంటా. సంతోషంగా ఉన్న ఈ ఇద్దరి మధ్యలో ఒక అమ్మాయి వస్తుందట… ఆమె వల్ల ఇద్దరు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఇప్పుడు ఆపాత్ర పోషించే హీరోయిన్ కోసమే డైరక్టర్ గాలిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. పెళ్ళికి ముందు ‘ఏ మాయ చేశావే’ .. “ఆటో నగర్ సూర్య” .. “మనం ” చిత్రాల్లో నటించిన ఈ జంట పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus