దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె ఖుషి యశోద సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఈమె నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు.
సోషల్ మీడియా వేదికగా తన క్యూట్ లుక్స్ షేర్ చేస్తూ రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సాంప్రదాయమైన దుస్తులను ధరిస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా బికినీ ధరిస్తూ కూడా హాట్ ఫోటోలకు ఫోజ్ లు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పలుసార్లు ఈమె వస్త్రధారణ విషయంలో భారీగా ట్రోల్ అవుతూ ఉంటుంది.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం సమంత నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో నయనతార విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా తమిళంలో మంచి విజయం అందుకున్నప్పటికీ తెలుగులో పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేదు. ఇకపోతే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో సమంత ఎరుపు రంగు షరారా ధరించి సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఆ సన్నివేశానికి సంబంధించిన ఫోటో ని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. సరికొత్త లుక్ లో ఉన్నటువంటి ఈ ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది. డిజైనర్ కవిత గుత్తా రూపొందించిన ఎరుపు రంగు షరారాలో సమంత లుక్ ఎంతో అందంగా ఉందని చెప్పవచ్చు.