Samantha: అందాల జాతరతో కుర్రాళ్ళ గుండెల్లో చిచ్చుబుడ్డి రగిలించి దీపావళిని ముందే తీసుకొచ్చిన సమంత!

సమంత గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. యశోద, శాకుంతలం తర్వాత సమంత విజయ్‌ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమాను చేసింది. ఇక సమంత ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. అది అలా ఉంటే సమంత త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఏకంగా కండల వీరు సల్మాన్ ఖాన్ సరసన నటించనుందని టాక్ నడుస్తోంది. కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ పై విష్ణువర్ధన్ తెరకెక్కించనున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా సమంత ఫోటో‌షూట్‌లో అందాల రచ్చ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. సమంత బ్లూ కలర్ డ్రస్ లో అందాలను చూపిస్తూ అందాల జాతర చేసింది.. ఈ ఫోటోలు చూసిన నేటిజన్లు… కుర్రాళ్ళ గుండెల్లో చిచ్చుబుడ్డి రగిలించి దీపావళి పండగను ముందుగానే సమంత తీసుకొచ్చిందని కామెంట్ చేస్తున్నారు.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus