Samantha: జిమ్‌లో సమంత వర్కౌట్స్.. పెట్ ఏం చేస్తుందో చూశారా!.. వైరల్ అవుతున్న వీడియో..!

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ నుంచి కోలుకుని.. బౌన్స్ బ్యాక్ అవడానికి పనిలో బిజీ కానుంది. ఇటీవలే వరుణ్ ధావన్‌తో కలిసి.. తనను ‘ది ఫ్యామిలీమెన్ – 2’ సిరీస్‌తో బాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చేసిన దర్శకద్వయం రాజ్ – డీకే తెరకెక్కించనున్న న్యూ సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్‌ కోసం బాంబే వెళ్లింది. ఇది పాపులర్ ఇంగ్లీష్ సిరీస్‌ ‘సిటాడెల్’ కి రీమేక్‌గా రూపొందుతుండగా.. సామ్, వరుణ్ గూఢచారి పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే సమంత అక్కడే ఇల్లు కొనుక్కుని, నివాసం ఏర్పరచుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. హిందీలో మరికొన్ని ప్రాజెక్టులకు తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొంతకాలం బాంబేలోనే ఉండాలనుకుంటుందట. విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్న ‘ఖుషి’ మూవీ షూట్ సామ్ కారణంగానే డిలే అవుతోంది.

అలాగే సామ్ ప్రధానపాత్రలో నటించిన హిస్టారికల్ పాన్ ఇండియా ఫిలిం ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సి ఉండగా.. లాస్ట్ మినిట్‌లో పోస్ట్‌పోన్ చేశారు. రీసెంట్‌గా జిమ్‌లో చెమటోడుస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిందామె. సీరియస్‌గా వర్కౌట్స్ చేస్తుంటే.. పెట్, సామ్‌ని తడుముతూ.. అలా చూస్తూ ఉండిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే తన న్యూట్రిషన్ డైట్ గురించి కూడా పోస్ట్ చేసింది సామ్..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus