Samantha: వైరల్ అవుతున్న నటి సమంత పోస్ట్!

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. తన ఫ్రెండ్ అయిన శిల్పారెడ్డితో కలిసి సమంత తీర్థయాత్రలకు వెళ్లి పూజలు చేస్తుండగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విడాకులు తీసుకోవడానికి ముందు నుంచి సమంత సోషల్ మీడియాలో “మై మమ్మా సైడ్(మా అమ్మ చెప్పింది” అంటూ హ్యాష్ ట్యాగ్ తో కొన్ని పోస్టులను షేర్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సమంత ఇదే హ్యాష్ ట్యాగ్ తో ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ పోస్ట్ లో సమంత “ఇప్పుడు మీరు కలిగి ఉన్నవాటితో కృతజ్ఞతతో ఉండండి, రేపు ఏం కావాలని కోరుకుంటున్నారో అందుకోసం పోరాడుతూ ఉండండి” అని పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన చైతన్య సమంత విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. చైతన్యతో విడిపోయిన తర్వాత షూట్ లో పాల్గొన్న సమయంలో సమంత బాధ పడ్డారని వార్తలు వైరల్ అయ్యాయి. ఆ బాధ నుంచి బయటపడాలనే ఆలోచనతోనే సమంత తీర్థయాత్రలు చేస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు సమంత రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ రెండు సినిమాల రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. వచ్చే ఏడాది శాకుంతలం సినిమాతో పాటు సమంత నటిస్తున్న రెండు సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయని సమాచారం. త్వరలో సమంత నటించబోయే బాలీవుడ్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా వెలువడనున్నాయని తెలుస్తోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus