Samantha: వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ సమంత పోస్ట్!

స్టార్ హీరోయిన్ సమంతకు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సమంత నటించిన శాకుంతలం సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా సమంత ఫస్ట్ లుక్ లో చాలా అందంగా ఉన్నారని శకుంతల పాత్రకు ఆమె పర్ఫెక్ట్ గా సూటయ్యారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎంతో కష్టపడి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్న సమంత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

Click Here To Watch

తాజాగా సమంత ఒక ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడాకుల తర్వాత సమంత తన స్నేహితులకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన సమంత ఆ ఫోటోతో పాటు ‘నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను’ అనే క్యాప్షన్ ను రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో సమంత చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటోకు 17 లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. మరోవైపు శాకుంతలం కాకుండా సమంత నటించిన కాతు వాకుల్‌ రెండు కాదల్‌, యశోద సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలపై కూడా సమంత దృష్టి పెడుతున్నారు. సమంత బీచ్ ఒడ్డున స్నేహితురాలితో ఫోటో దిగగా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనే హాష్ ట్యాగ్ ను కూడా జోడించటం గమనార్హం. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న సమంత మరోవైపు విహారయాత్రలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సమంత వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియా ఫాలోవర్ల విషయంలో సమంత కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లను మించి సమంత ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus