సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం ఈమె అమెరికాలో ఉంటున్నారు. ఈ విధంగా సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తూ ఉన్నారు. ఇక సమంత చివరిగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అయితే సమంత ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో విజయ్ దేవరకొండ మాత్రమే ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే సమంతకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఈ సినిమా కోసం తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్లు సుమారు కోటి రూపాయల వరకు నిర్మాతలకు వెనక్కి తిరిగి ఇచ్చారని తెలుస్తుంది. అయితే సమంత ఇలా రెమ్యూనరేషన్ తిరిగి వెనక్కి చెల్లించడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే..
సమంత (Samantha) ఈ సినిమాలో నటించినప్పటికీ ప్రమోషన్ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఇలా ప్రమోషన్లకు దూరంగా ఉన్నటువంటి ఈమె తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చారని తెలుస్తుంది. సాధారణంగా ఒక సినిమాకు అగ్రిమెంట్ చేసుకునే సమయంలోనే రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేసుకుంటారు. అలాగే ఈ సినిమా ప్రమోషన్లకు తప్పనిసరిగా సెలబ్రిటీలు కూడా హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ఈమె ప్రమోషన్లకు దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతలు తనని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు అయితే సమంత మాత్రం ఇప్పటివరకు కొంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నారని మరో కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఆ కోటి రూపాయలు తిరిగి నిర్మాతలకి వెనక్కి చెల్లించారని తెలుస్తోంది.