బొద్దు గుమ్మలే ముద్దు అనుకున్న స్థాయి నుంచి సన్నజాజులంటే మోజు అనేలా మారిపోయారు టాలీవుడ్ అభిమానులు. ఈ క్రమంలో హీరోయిన్లు కూడా ఎప్పుడూ ఫిట్‌గా ఉండటానికే ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఇండస్ట్రీకి వచ్చి 10-15 ఏళ్లు అవుతున్నా… ఇంకా తొలి సినిమా అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలానే ఉన్నారు. అలాంటి నాయికల్లో సమంత ఒకరు. ఎప్పటికప్పుడు కసరత్తులు చేస్తూ… ఫిట్‌గా ఉంటోంది.
సమంత అందం గురించి మాట్లాడితే… ఆమె ఫిట్ బాడీ గురించి మాట్లాడుకోవాలి. సామ్ అందాల్లో ఆమె బ్యాక్ది కీలక పాత్ర అని అభిమానులు అంటుంటారు. ఆమె కూడా అదే మాట చెబుతోంది. అంతేకాదు తన బెస్ట్ బూటీ వెనుక ఉన్నది ఎవరు అనేది కూడా చెప్పేసింది సమంత. స్నేహ దేశు అనే ఫిట్నెస్ ట్రైనర్ వల్లే తనకు బెస్ట్ బూటీ సాధ్యమైందని సమంత ఇటీవల సోషల్ మీడియాలో రాసుకొచ్చింది సమంత.
వెయిట్ మోస్తూ ఫ్రంట్ క్వాట్స్ చేస్తున్న వీడియోను సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే తన అట్రాక్షన్ గురించి చెప్పుకొచ్చింది సమంత. అంతేకాదు తనకు ఏ మాత్రం నచ్చని ట్రైనర్… ఈ కారణంగానే నచ్చారు అని చెప్పింది కూడా. ఇదంతా చూస్తుంటే సమంత ఫిట్నెస్ ఎంతగా కనిపిస్తోందో, ఆమె లోని బోల్డ్ నెస్ కూడా అంతే కనిపిస్తోంది. మనం అప్పుడెప్పుడో చెప్పుకున్నట్లు… పెళ్లయ్యాక సమంతలో బోల్డ్నెస్ బాగా పెరిగిందండోయ్.