Samantha: సమంత షాకింగ్ కామెంట్స్.. అంతా అయిపోయినట్టు కాదంటూ?

  • March 29, 2023 / 01:58 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత మరో రెండు వారాల్లో శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమా ఒక విధంగా సమంత కెరీర్ ను డిసైడ్ చేయనుంది. అయితే తాజాగా సమంత రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. రెమ్యునరేషన్ కోసం ఎవరినీ యాచించాల్సిన అవసరం లేదని సమంత చెప్పుకొచ్చారు. హీరోహీరోయిన్లకు సమాన పారితోషికం గురించి సమంత మాట్లాడుతూ నేను డైరెక్ట్ గా కాకపోయినా పోరాడుతున్నానని సమంత చెప్పుకొచ్చారు.

హీరోహీరోయిన్లకు సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని నేను కోరుకోవడం లేదని కష్టాన్ని చూసి రెమ్యునరేషన్ ఇవ్వాలని భావిస్తున్నానని సామ్ అన్నారు. సినిమాకు చెందిన వాళ్లే మేము మీకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పాలని సమంత కామెంట్లు చేశారు. నాకు ఇంతే రెమ్యునరేషన్ ఇవ్వాలని నేను యాచించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. మన కృషి ఆధారంగా రెమ్యునరేషన్ వస్తుందని ఆశిస్తున్నానని సామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. స్త్రీ పురుషుల మధ్యే ప్రేమానురాగాలు ఉండవని ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కూడా ప్రేమానురాగాలు ఉంటాయని సామ్ చెప్పుకొచ్చారు. ఒక రిలేషన్ లో ఫెయిల్ అయినంత మాత్రాన అంతా అయిపోయిందని అనుకోవద్దని సమంత అన్నారు. సమంత ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

సమంత (Samantha) పారితోషికం ప్రస్తుతం 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే సామ్ రెమ్యునరేషన్ మరింత పెరగనుందని తెలుస్తోంది. సమంత మరిన్ని విజయాలను అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. సామ్ కెరీర్ అనుకున్న విధంగా సాగుతుందో లేదో చూడాలి. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా సామ్ కు ఆఫర్లు అయితే తగ్గడం లేదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus