తెలుగు సినీ అభిమానులకు క్యూట్ నటి సమంత షాక్ ఇచ్చింది. ఇక స్యామ్ సినిమాలో నటించదు, పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పనుంది అనే వార్తలను ఆమె ఒక సంతకంతో కొట్టి పడేసింది. యువ తమిళ హీరో కార్తికేయన్ తో రొమాన్స్ చేయడానికి సమంత సిద్ధమైంది. పోన్రమ్ దర్శకత్వంలో రూపు దిద్దుకోనున్న మాస్ ఎంటర్ టైనర్ మూవీలో కథానాయికగా అంగీకరించింది. ఈ విషయాన్నీ చిత్ర బృందం స్పష్టం చేసింది.
24 ఏఎం వారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత తో నటించే అవకాశం దక్కినందుకు హీరో కార్తికేయన్ ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిసింది. తమ అభిమాన నటి సమంత నటనను కొనసాగిస్తుండడడం తో ఆమె ఫ్యాన్స్ కూడా అనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన భారీ బడ్జట్ చిత్రం “జనతా గ్యారేజ్” సెప్టెంబర్ 2 న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత ఏ సినిమా చేస్తుందో అనే విషయం పై కొంతకాలంగా ఆమె నోరు విప్పలేదు. నిర్మాతల ద్వారా సమంత కొత్త సినిమా విషయం బయటికి వచ్చింది.
Thankyouu😊😊😊😊Glad to be on board https://t.co/JQPGRoq3ra
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 19, 2016