Samantha: ఆ కారణంగానే సమంత అంత కాస్ట్లీ చెప్పులు వేసుకుంటుందా..!

ఈ మధ్య చాలా మంది సెలెబ్రిటీలు ఎయిర్ పోర్ట్ లో వెళ్లడం, రావటం లాంటి ఫోటోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. అయితే నెటిజన్స్ ఎక్కువగా ఈ సెలెబ్రిటీస్ వేసుకున్న చెప్పుల మీద దృష్టి పెడుతున్నారు. వాటి ధరలు చూస్తుంటే బాబోయ్ వెళ్లేంటి చెప్పుల మీద ఇన్నేసి లక్షలు ఖర్చు పెడుతున్నారు అని ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క చెప్పుల మీదే వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెడుతుంటే, ఇక మిగతా వాటి మీద ఎంతెంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించుకోండి.

ఇప్పుడు ఈ చెప్పుల విషయం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మొన్న సమంత ‘ఖుషీ’ సినిమాకోసం టర్కీ వెళ్ళింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన ఆమె నటిస్తోంది. శివ నిర్వాణ దీనికి దర్శకుడు. అలా వెళుతూ ఎయిర్ పోర్ట్ లో కనపడింది. అందరి దృష్టి ఆమె చెప్పుల మీద పడింది. ఇంతకీ ఆమె వేసుకున్న చెప్పుల ఖరీదు ఎంతో తెలుసా రెండు లక్షల రూపాయలకు పైనే ఉంటుంది అని ప్రచారం చేశారు. ఈ మేరకు ఎన్నో వార్తలు నెట్టింట వైరలయ్యారు.

కానీ సమంత ఆ చెప్పులు ధరించడానికి ఓ కారణం ఉంది. సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగా అరికాళ్లు చాలా సున్నితంగా తయారవుతాయిట. అందుకే చాలా మొత్తగా ఉండే చెప్పులు వేసుకోవాలి. ఇక సమంత ఎలాగూ బాగా రిచ్ కిడ్ కాబట్టే అన్ని లక్షలు పెట్టి చెప్పులు కొనుక్కుని వేసుకుంది. ఆమె వేసుకున్నవి లూయిస్ విట్టన్ కంపెనీ కి చెందిన చెప్పులు వేసుకుంది అంటున్నారు. ఇది ఈమధ్య ‘సిటాడెల్‘ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ఈ చెప్పులు అక్కడ కొనింది అని కూడా అంటున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus