తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో డెడికేషన్ తో పనిచేసే కథానాయికల్లో సమంత ఒకరు. వరుసహిట్స్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నప్పటికీ కొత్త హీరోయిన్ మాదిరిగా కష్టపడుతుంటుంది. ఆమె నాగచైతన్యను పెళ్లి చేసుకున్నవెంటనే చాలామంది విమర్శలు గుప్పించారు. సినిమాలు తగ్గించేస్తుందని కొంతమంది.. పెళ్లి తర్వాత నటిస్తే ఆమెను ఎవరైనా చూస్తారా? అని మరికొంతమంది విమర్శించారు. ఇంకా కొందరైతే సమంత కమర్షియల్ సినిమాలకు పనికిరాదని, ఆర్ట్ సినిమాలు చేసుకోవాల్సిందేనని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. వారందరికీ రంగస్థలంలో తన నటనతో బుద్ధి చెప్పింది సమంత. రామలక్ష్మిగా ఆమె చేసిన ఫెర్మామెన్స్ కి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ప్రసంశలు గుప్పిస్తున్నారు. దీంతో పెళ్లి తర్వాత హీరోయిన్స్ సైడ్ రోల్స్ చేసుకోవాల్సిందే అనేవారు నోరు మూసుకున్నారు.
పెళ్లి తరవాత ఇంటికే పరిమితం కాకుండా అనుకున్న సమయానికి మూడు సినిమాలను కంప్లీట్ చేసి గాసిప్ రాయళ్ల చెంప చెళ్లుమనిపించింది. రంగస్థలంలో మాత్రమే కాకుండా సావిత్రి బయోపిక్ మహానటిలో మధురవాణిగా మెప్పించబోతోంది. ఇరంబు తిరై లోను తన అందంతో ఆకట్టుకోనుంది. ఇవే కాకుండామరో మూడు సినిమాలకు సైన్ చేసి రూమర్ గాళ్ల మాటలకు చెక్ పెట్టింది. నటులు పెళ్లి తర్వాత హీరోలుగా కొనసాగినట్టే.. నటీమణులు కూడా హీరోయిన్స్ గా కొనసాగవచ్చని సమంత నిరూపించింది.